
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్’ చిత్రం మలయాళం సినిమా ‘అయ్యపనం కోషియం’ ఆధారంగా రూపొందుతోంది. కథతో పాటు హీరోయిన్లను కూడా మలయాళం నుంచి తెచ్చుకున్నారు మేకర్స్. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్య మీనన్ నటిస్తోంది. ఇక రానాకి జోడిగా సంయుక్త మీనన్ అనే కేరళకుట్టి సెలెక్ట్ అయింది.
ఇటు పవన్ సరసన, అటు రానా పక్కన ఇద్దరు మీనన్ ముద్దుగుమ్మలు నటిస్తుండడం విశేషం.
ఈ సినిమాలో హీరోయిన్ల పాత్రకు పెద్దగా నిడివి ఉండదట. అందుకే, ప్రస్తుతం క్రేజ్ లేని నిత్యమీనన్ ని పవన్ కళ్యాణ్ భార్యగా తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోన్న సంయుక్తని రానాకి జోడిగా సెలెక్ట్ చేశారు.
ముందుగా రానా సరసన ఐశ్వర్య రాజేష్ ఫిక్స్ అయింది. కానీ ఆమె డేట్స్ లేవని తప్పుకొందని చెప్తున్నారు. కానీ, నిజమేమిటంటే చిన్న చిన్న పాత్రలు ఇక చెయ్యొద్దని ఆమె సైడ్ అయిపోయిందట. సో… ఈ ప్రాజెక్ట్ లోకి ఇంకో మీనన్ వచ్చి చేరింది.