హోమ్ క్వారెంటైన్లో ఊర్మిళ

TeluguCinema 01 Nov 2021
urmila matondkar

మళ్ళీ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. ఒకప్పటి అగ్ర హీరోయిన్ ఊర్మిళ మతోండ్కర్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఆమె ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్లో ఉన్నారట. “అవును కరోనా సోకింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాను. కోవిడ్ ఐసోలేషన్ లో ఉన్నాను. నన్ను ఈ మధ్య కలిసిన వారందరూ కూడా ఐసోలేషన్ కి వెళ్ళండి. అలాగే, ఈ దీపావళి పండుగ సంబరాల్లో అన్ని జాగ్రత్తలు తీస్కోండి,” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొంది ఊర్మిళ.

రంగీళా సినిమాతో దేశమంతా సంచలనం సృష్టించిన ఊర్మిళ తెలుగులో అనేక చిత్రాలు చేశారు. ‘అంతం’, ‘గాయం’ వంటి తెలుగు క్లాసిక్స్ తో పాటు ‘భారతీయుడు’, ‘సత్య’ వంటి అనువాద చిత్రాలతో కూడా తెలుగులో ఆమె బాగా పాపులర్.

రెండేళ్ల క్రితం ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు, ఆమె సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.

TeluguCinema

View all posts

Recent News