కాజల్ కూడా తాగమంటోంది!

Kajal Aggarwal


ఇటీవల హీరోయిన్లు మందు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. ఆ మధ్య రెజీనా ‘టీచర్స్’ బ్రాండ్ ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికపై ప్రమోట్ చేస్తే ట్రోలింగ్ ఫుల్లుగా సాగింది. డబ్బులు ఇస్తే ఏ బ్రాండ్ ని అయినా ప్రోమోట్ చేసేందుకు కొందరు హీరోయిన్లు ఎప్పుడూ సిద్ధమే. ఆ లిస్ట్ లో కాజల్ అగర్వాల్ కూడా ఉంది.

Advertisement

ఇటీవలే మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్న ఈ భామ… భర్తతో కలిసి ‘టీచర్స్’ బ్రాండ్ కి ఇన్ స్టాగ్రామ్లో ప్రచారం కల్పిస్తోంది. ఆమె, ఆమె భర్త ఇద్దరూ కలిసి చీర్స్ అంటూ ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నారు. అందరిని దీపావళికి ఈ బాటిల్ తో సెలెబ్రేట్ చేసుకోమని చెప్తోంది ఈ జంట. డబ్బుల వస్తున్నాయి కాబట్టి ఇద్దరూ ఇలా హ్యాపీగా మందుబాటిల్ ముందు ఫోజులిచ్చారు.

టీవీల్లో, పత్రికల్లో, వెబ్ సైట్ లలో మందు బ్రాండ్స్ ని ప్రోమోట్ చేసేందుకు చట్టాలు ఒప్పుకోవు. అందుకే, ఈ బ్రాండ్స్ తెలివిగా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలెబ్రెటీలకు డబ్బులు ఇచ్చి ఇన్ స్టాగ్రామ్ వేదికపై ప్రచారం చేస్తున్నాయి.

ఐతే, కాజల్ కి కూడా ట్రోలింగ్ తప్పడం లేదు. “అంటే ఇద్దరూ కలిసి మందు వేస్తున్నారా?,” అని ప్రశ్నలు పడుతున్నాయి.

Advertisement
 

More

Related Stories