ప్రగ్యాకి ఓ బుల్లి ఛాన్స్

TeluguCinema 13 Feb 2023
pragya stills 050123 004

ప్రగ్య జైస్వాల్ కెరీర్ లో అతిపెద్ద హిట్… అఖండ. నిజం చెప్పాలంటే అది కళ్ళు చెదిరే హిట్. అంత పెద్ద విజయం దక్కినప్పుడు ఏ హీరోయిన్ కైనా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. హిట్ హీరోయిన్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తారు.

కానీ ప్రగ్య జైస్వాల్ విషయంలో అలాంటిదేమి జరగలేదు. ఆమెకి ఇప్పటివరకు ఇంకో సినిమా ఛాన్స్ రాలేదు. ‘అఖండ’ 2021 డిసెంబర్ లో విడుదలైంది. 15 నెలల తర్వాత కూడా ఆమెకి ఒక్కటి అంటే ఒక్క సినిమా ఏ నిర్మాత ఆఫర్ చెయ్యలేదు. ఇదొక విచిత్రమే.

ఐతే, ఇప్పుడు ఆమెకి ఒక బుల్లి ఛాన్స్ వచ్చింది. మళ్ళీ బాలయ్య సరసనే ఆమె కనిపిస్తోంది. బాలయ్య నటిస్తున్న ఒక యాడ్ ఫిలింలో ఆమె కూడా ఉంది. ఈ యాడ్ ఫిలిం ఆమెకి దక్కింది.

తాజాగా ఆ యాడ్ ని చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఆ యాడ్ ఫిలిం బయటికి వస్తుంది. 15 నెలల తర్వాత ఈ భామకి మళ్ళీ బాలయ్య సరసనే ఛాన్స్ వచ్చింది. కానీ ఇది సినిమా కాదు. చిన్న యాడ్ ఫిలిం. ఎంత పెద్ద హిట్ కొట్టినా కొందరికి అవకాశాలు అంత ఈజీగా రావు అనడానికి ఉదాహరణ … ఈ భామ.