
ఎవ్రీ ఇయర్… టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ తారల లిస్ట్ ని ప్రకటిస్తుంటుంది టైమ్స్ గ్రూపు. కరోనా కారణంగా 2019 లిస్ట్ ని చాలా లేట్ గా ప్రకటించింది. మగవారిలో టాప్ అందగాడు… రణ్వీర్ సింగ్. ఇప్పుడు హీరోయిన్ల లిస్ట్ వచ్చింది. దిశా పటాని టాప్ అందెగత్తె అని లిస్ట్ లో తేలింది.
2019 మోస్ట్ డిజైరబుల్ బ్యూటీ ..దిశా.
తెలుగులో పూరి తీసిన “లోఫర్” సినిమా తో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసింది. ధోని, భాగీ 2, భారత్, మాలాంగ్ వంటి సినిమాల్లో అందచందాలు ఆరబోసి కుర్రాళ్ళ బాడీల్లో సెగలు రేపింది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పుట్టించే హిట్ అంతా ఇంతా కాదు. అందుకే టాప్ 50 లో నెంబర్ వన్ అందం అనిపించుకొంది.
టాప్ 10 అందెగత్తెలు వీళ్లే
కియారా అద్వానీ వంటి లేటెస్ట్ అండ్ హాటెస్ట్ భామలు ఈ రేస్ లో వెనుకబడడం విశేషం. అలాగే… సమ్మోహనం, వి సినిమాల బ్యూటీ అదితి రావుకి టాప్ టెన్ లో చోటు దక్కడం కూడా విశేషంగానే చెప్పుకోవాలి.
- దిశా పటాని
- సుమన్ రావు
- కత్రిన
- దీపిక
- వర్తిక సింగ్
- కియారా అద్వానీ
- శ్రద్ధ కపూర్
- యామి గౌతమ్
- అదితి రావు
- జాక్వెలిన్