ఆర్జీవీకి నచ్చితే బిగ్ బాస్ లో చోటు!


నీ తొడలు బాగున్నాయి… అంటూ ఒక భామకి కాంప్లిమెంట్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఆ భామ వెంటనే వర్మ చెంపపై ఒకటిచ్చింది. ఇదంతా ఒక ఇంటర్వ్యూ ప్రొమోషన్ కోసం. ఆ భామకి ఆ తర్వాత ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ (హాట్ స్టార్ వర్షన్)లో చోటు దక్కింది. ఆ థండర్ గాళ్ ఎవరో కాదు అషు రెడ్డి.

ఇక, రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసేందుకు ఒక యాంకర్ వెళ్ళింది. ఇంటర్వ్యూ మధ్యలోనే రామ్ గోపాల్ వర్మ ఆమె ఫిజిక్ గురించి పొగిడారు. ఆ యాంకర్ సిగ్గుపడుతూ హొయలు పోయింది. ఆమె సిగ్గు సిత్రం వీడియో రూపంలో వైరల్ అయింది. ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ వెంటనే బిగ్ బాస్ టీం ఆమెకు ఛాన్స్ ఇచ్చింది.

ఒక పార్టీలో ఒక ముస్లిం యువతి రామ్ గోపాల్ వర్మతో డ్యాన్స్ చేసింది. వర్మ, ఆ యువతి చేసిన డ్యాన్స్ వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ అయింది. అప్పటికే ఆ భామ చిన్న చిన్న పాత్రల్లో నటించింది. కానీ, గుర్తింపు రాలేదు. వర్మతో డ్యాన్స్ ఆమె అదృష్టాన్ని మార్చింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ టీం ఆమె ఇంటి తలుపు తట్టింది.

Inaya Sultana

ఇనాయ సుల్తానా ‘బిగ్ బాస్ తెలుగు 6’లో కంటెస్టెంట్ గా పాల్గొననుంది. ఆమె సీట్ కంఫర్మ్ అయింది. దాంతో, తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోషూట్ ఫోటోలు పెట్టిస్తోంది తన టీంతో. అరియనా తర్వాత వర్మ వల్ల బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది ఇనయ సుల్తానా.

వర్మతో ఎదో ఒక కాంట్రవర్సీ వీడియో చేస్తే ఆ భామలపై బిగ్ బాస్ టీం దృష్టి పడుతుందని, అలా సులువుగా అవకాశం పొందొచ్చని అంటున్నారు. అరియనా, అషు, ఇనయలకు వచ్చిన ఆఫర్ల ని చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తోంది. అషు రెడ్డి ‘బిగ్ బాస్ మూడో సీజన్’లోనే పాల్గొంది. కానీ, ఆమెకి రెండో సారి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఛాన్స్ రావడం వర్మ వీడియో వల్లే అని అంటారు.

Ashu Reddy

ALSO READ: Chalaki Chanti and Vasanthi in Bigg Boss Telugu 6!

సెప్టెంబర్ 4న స్టార్ మాలో ప్రసారం కానుంది ‘బిగ్ బాస్ తెలుగు 6’. నాగార్జున హోస్ట్ చేస్తారు. 20 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు.

 

More

Related Stories