అలాంటివి తప్పవు: అనన్య

TeluguCinema 06 Nov 2023
Ananya Nagalla

తెలుగు సినిమాలు పలువురు తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణిస్తున్న మాట నిజమే. కానీ వారికి వస్తున్న అవకాశాలు అంతంతమాత్రమే. ఒక్క శ్రీలీల మాత్రమే టాప్ పొజిషన్లో ఉంది. మిగతా తెలుగు అమ్మాయిలు చిన్న చిత్రాలతో సరిపెడుతున్నారు. అలాంటి తెలుగు భామ… అనన్య నాగళ్ళ.

“మల్లేశం” సినిమాతో లైంలైట్లోకి వచ్చింది ఈ హైదరాబాదీ బ్యూటీ. ఆ తర్వాత “ప్లే బ్యాక్” చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత “వకీల్ సాబ్”లో కీలక పాత్ర పోషించింది. అలాగే “మేస్ట్రో”, “శాకుంతలం” వంటి సినిమాలు కూడా చేసింది. ఇక ఎం.ఎస్.రాజు తీసిన “మళ్ళీ పెళ్లి” చిత్రంలో అందాలు ఆరబోసింది.

ఇటీవల ఈ భామ గ్లామర్ ఫోటోషూట్లు కూడా ఎక్కువే చేస్తోంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ భామకి ఇలాంటివి అవసరమా అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. దానికి ఆమె సమాధానం ఇచ్చింది.

“హీరోయిన్ అన్నాక అలాంటి ఫోటోషూట్లు చెయ్యక తప్పదు. ముఖ్యంగా వేరే భాషలకు చెందిన అమ్మాయిలు గ్లామర్ తోనే నెట్టుకొస్తున్నప్పుడు తెలుగు అమ్మాయిలు పోటీ తట్టుకోవాలి కదా. సో ఇలాంటివి తప్పవు. సర్దుకుపోవాలి అంతే,” అని నిజం మాట్లాడింది ఈ భామ.

Ananya Nagalla

ఇటీవల ఈ భామ చిన్న చిత్రాలు మాత్రం బాగానే లాగేసుకొంది. ప్రస్తుతం మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి మరి. గ్లామర్ షోతో ఈ మాత్రం అయినా అవకాశాలు వస్తున్నాయి అన్నమాట.

TeluguCinema

View all posts

Recent News