ఆదిపురుష్ హిందీలో పడిపోయింది!

TeluguCinema 20 Jun 2023
Adipurush


“ఆదిపురుష్” మొదటి మూడు రోజులు అద్భుతంగా ఆడింది. అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ అదరగొట్టింది. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరిగినా జనం పట్టించుకోకుండా మొదటి వీకెండ్ సినిమాకి కళ్ళు చెదిరే కలెక్షన్లు అందించారు. ఒక తెలుగు హీరో నటించిన చిత్రానికి హిందీ ప్రేక్షకులు 100 కోట్లపైన వసూళ్లు మొదటి వీకెండ్ లో ఇవ్వడం అంటే మాటలు కాదు. ప్రభాస్ కున్న క్రేజ్ అలాంటిది.

ప్రభాస్ కి నార్త్ ఇండియన్ మార్కెట్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన నిజమైన పాన్ ఇండియన్ స్టార్. ఐతే, ఈ సినిమా రామాయణాన్ని వక్రీకరించింది అనే మాట బాగా స్ప్రెడ్ అయింది. అలాగే హనుమంతుడి నోటి నుంచి మరీ నాసిరకం మాస్ డైలాగ్ లు చెప్పించడం జనం జీర్ణించుకోలేకపోయారు. దానికి తోడు, హిందీ రచయిత మనోజ్… ఇది రామాయణం కాదు అని బుకాయించడం మరింత ఇబ్బంది కలుగచేసింది.

దాంతో, సోమవారం ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఆదివారం 35 కోట్లు వస్తే సోమవారం కేవలం 9 కోట్లు వచ్చాయి. మంగళ, బుధ వారాల్లో మరింతగా పడిపోవడం ఖాయం. మళ్ళీ రెండో వీకెండ్ పుంజుకుంటుందా అనేది చూడాలి.

“ఆదిపురుష్” సినిమాని దర్శకుడు ఓం రౌత్ కొంచెం భక్తితో తీస్తే సినిమా బాహుబలిని మించిపోవు. కానీ, ఒక “పర్టిక్యులర్ పర్పోజ్జ్” తీయడం వల్ల ఈ సమస్య. ఇప్పటివరకు వచ్చిన భారీ కలెక్షన్లే ఒక బిగ్ బోనస్ అనుకోవచ్చు.