బాయ్ ఫ్రెండ్ మూవీకి ప్రమోషన్

Aditi Rao

హీరో సిద్దార్థ్, హీరోయిన్ ఆదితి రావు ప్రేమికులు. కానీ, ఆ విషయాన్ని బయటికి చెప్పుకోరు. ఇద్దరూ కలిసి కెమెరా ముందుకు వచ్చి ఫోజు ఇవ్వరు. ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా తాము కలిసి ఉన్న వీడియోలు పోస్ట్ చేస్తారు. అయినా మీడియా ముందు మాత్రం అదేమీ లేదన్నట్లుగా మాట్లాడుతుంటారు.

తాజాగా ఆదితి రావు తన ఇన్ స్టాగ్రామ్ లో ‘టక్కర్’ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాలో పాట బాగుంది అని ఒక పోస్ట్. విడుదల తేదీ గురించి మరో పోస్ట్. ఇలా ఆదితి రావు నిత్యం పోస్టులు పెడుతున్నది అందరూ చూస్తూనే ఉన్నారు.

ఈ సినిమాకి ఆమెకి లింక్ లేదు. కేవలం ఆమె బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ హీరోగా నటించిన చిత్రం కాబట్టే ఆమె తన సొంత సినిమాలా ఆమె తెగ ప్రొమోషన్ మొదలు పెట్టడం విశేషం.

Advertisement
 

More

Related Stories