ఐశ్వర్య లక్ష్మి కూడా తప్పుకుంది

TeluguCinema Team 13 Sep 2025
aishwarya thumb 3

సోషల్ మీడియా అంటేనే ట్రోలింగ్, బూతులమయంగా మారిపోయింది. హీరోయిన్లకైతే బాడీ షేమింగ్ అదనం. దీంతో చాలామంది కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటున్నారు. అలాగే ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోయిని, హీరోయిన్లని తెగ ట్రోల్ చేస్తున్నారు. దాంతో సెన్సిటివ్ గా ఉన్నవాళ్లు సోషల్ మీడియాకి బ్రేక్ ఇవ్వడమో, పూర్తిగా సైలెంట్ ఐపోయివడమో చేస్తున్నారు.

ఇటీవల అనుష్క శెట్టి “ఘాటీ” సినిమా ఫ్లాప్ కాగానే సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చింది.

ఇప్పుడు ఐశ్వర్య లక్ష్మి కూడా అదే పనిచేసింది. తను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్న విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. కెరీర్ పరంగా సోషల్ మీడియా తప్పనిసరి అనే ఆలోచనతో ఉండేదాన్నని, అందుకే ఇన్నాళ్ల పాటు సోషల్ మీడియాతో ఉండాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది.

అయితే రీసెంట్ గా తన ఆలోచన మారిందని, సోషల్ మీడియా వాడకం వల్ల తన భాష, పదాల ఎంపిక కూడా మారిపోతోందని, తన క్రియేటివిటీని సోషల్ మీడియా చంపేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది ఐశ్వర్య లక్ష్మి.

అందుకే ఇనస్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి యాప్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఇకపై తనలో ఉన్న అమ్మాయికి పూర్తి స్వేచ్ఛనిస్తానని, సినిమాలపై మరింత ఫోకస్ పెడతానని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News