గూగుల్ 4 కోట్లు ఇవ్వాలి: ఐశ్వర్య

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇటీవలే ఢిల్లీ కోర్టులో కేసు వేసింది. తనకు సంబంధించిన వార్తలు, ఫోటోల విషయంలో తనకు పర్సనాలిటీ రైట్స్ ఉండాలని ఆమె కోరింది. ఈ విషయంలో ఆమెకి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఆ తీర్పు ప్రకారం ఆమె ఫోటోలు కానీ ఆమెకి వీడియోలు కానీ మార్ఫింగ్ చెయ్యకూడదు. ఆమె ఫోటోలను ఉపయోగించుకొని ఎలాంటి లాభాలు చేసుకోకూడదు. ఆమె అనుమతి లేకుండా ఆమె ఏఐ వీడియోలు కానీ, ఫోటోలను కానీ క్రియేట్ చేసి వాడకూడదు.
ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగేలా గూగుల్ సంస్థ ఏఐ వీడియోలను యూట్యూబ్ లో అనుమతించి, తన వ్యక్తిగత జీవితంపై వీడియోలు చేసేందుకు క్రియేటర్లకు అనుమతించినందుకు ఆమె పరిహారం కోరింది. ఆమె, ఆమె భర్త అభిషేక్ బచ్చన్ గూగుల్ నుంచి ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు కోరుతున్నారు.
గూగుల్ కి ఇది చాలా చిన్న మొత్తం. కేసు ఒకవేళ ఆమెకి అనుకూలంగా వస్తే గూగుల్ 4 కోట్లు ఇచ్చేందుకు ఇబ్బందిపడదు. కానీ ఐశ్వర్య ఈ కేసు గెలిస్తే మొత్తం యూట్యూబ్ క్రియేటర్లకు నష్టం.
ఇకపై సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎలాంటి వీడియోలు యూట్యూబ్ క్రియేటర్లు, మీడియా సంస్థలు చెయ్యలేవు. చేస్తే ఆ సెలెబ్రిటీలు డబ్బులు అడగొచ్చు. దాంతో, యూట్యూబ్ ఇలాంటి వీడియోలను ఎంకరేజ్ చెయ్యదు. సో, మీడియా సంస్థలకు, క్రియేటర్లకు రాను రాను యూట్యూబ్ రెవెన్యూ పడిపోతుంది.