Akhanda 2 Jukebox: ట్రోలింగ్ తగ్గింది!

Thaman and Nandamuri Balakrishna

‘అఖండ’ సినిమా విజయానికి కీలకంగా నిలిచింది తమన్ సంగీతమే. అందుకే “అఖండ 2” సినిమా మ్యూజిక్ రైట్స్ భారీ మొత్తానికి వెళ్లాయి. అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ తమన్ ఈ సినిమాతో ఎక్కువగా ట్రోలింగ్ ఎదురుకున్నాడు. ఎందుకంటే విడుదలైన మొదటి రెండు పాటలు నిరాశపర్చాయి.

“జాజికాయ” అనే డ్యూయెట్, అలాగే తాండవం అనే మరో పాట జనానికి ఎక్కలేదు. ఈ రెండు పాటలు క్రేజ్ పెంచలేకపోవడంతో ఈ సినిమా టీం మర్చిపోయిన “జ్యుక్ బాక్స్” ట్రెండ్ ని మళ్ళీ తీసుకొచ్చింది.

జ్యూక్ బాక్స్ అంటే సినిమాలోని అన్ని పాటలు ఒకే చోట యూట్యూబ్ లో పెట్టడం. ఈ జ్యుక్ బాక్స్ లో మొత్తంగా తొమ్మిది పాటలు ఉన్నాయి. రెండు మినహా మిగతావన్నీ భక్తి పాటల్లాంటివే. 32 నిముషాల నిడివి ఉన్న బాక్స్ కి ఇప్పుడు మంచి స్పందన వస్తోంది. పైగా బాలయ్య సినిమాల్లో ఇన్ని భక్తి పాటలు ఉండడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తమన్ కి ఇప్పుడు ట్రోలింగ్ తగ్గింది. కథ ప్రకారం “అఖండ 2″లో పాటలు ఇచ్చాడని అభిమానులు అంటున్నారు.

ఇటీవల బాలయ్య సినిమాలకు తమన్ వరుసగా సంగీతం ఇస్తున్నాడు. నందమూరి తమన్ అని ఫ్యాన్స్ పేరు కూడా పెట్టారు. అలాంటి తమన్ “అఖండ 2” విషయంలో క్యాచీ సాంగ్స్ ఇవ్వలేదు అని మొదట ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు జ్యుక్ బాక్స్ బయటికి వచ్చాక సర్దుకొంది. డిసెంబర్ 5న విడుదల కానుంది ఈ మూవీ.

More

 

Related Stories