కౌబాయ్ గా లవర్ బాయ్

TeluguCinema 05 Aug 2020
Akhil as cowboy

ప్రస్తుతం అఖిల్ లవర్ బాయ్ మాత్రమే. అన్నీ అలాంటి సినిమాలే చేస్తున్నాడు. మరి ఈయన కౌబాయ్ గా మారబోతున్నాడా? ప్రస్తుతానికైతే అలాంటిదేం లేదు. కానీ అఖిల్ కౌబాయ్ గెటప్ లో ఉన్న ఓ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో బాగా రౌండ్స్ కొడుతోంది.

అది కూడా ఇప్పటికి అఖిల్ కాదు. చిన్నప్పటి అఖిల్ ఫొటో.

మహేష్ బాబు హీరోగా నటించిన టక్కరిదొంగ సినిమా గుర్తుందా.. ఆ సినిమా సెట్స్ కు నాగార్జున, అమల, అఖిల్ వెళ్లారు. అప్పుడు అఖిల్ ను ఇలా సరదాగా తయారుచేసి తీసిన ఫొటో ఇది.

ఓ అక్కినేని అభిమాని ఈ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది బయటకొచ్చినప్పట్నుంచి కౌబాయ్ సినిమా చేయాలంటూ అఖిల్ కు విజ్ఞప్తులు ఎక్కువయ్యాయి.