ఈ వీక్ అఖిల్ కి దెబ్బ పడుతుందా?

ఈ వీకెండ్ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వెళ్లారు. టైటిల్ కోసం చివర్లో ఐదుగురు పోటీలో ఉంటారు. అంటే ఈ వీకెండ్ ఒకరు, మరో వీకెండ్ తర్వాత ఇంకొకరు ఎలిమినేట్ అవ్వాలి. అప్పుడు ఐదుగురు మిగులుతారు. ఈ వీకెండ్ అఖిల్ డేంజర్ జోన్లో పడ్డాడు. అఖిల్ తో పాటు జబర్దస్త్ అవినాష్ కూడా ఓటింగ్ లో వెనుకబడ్డట్లు గూగుల్ ట్రెండ్స్ చూపుతున్నాయి.

ఐతే ఎక్కువ డేంజర్ అఖిల్ కే ఉంది. మరి ఈ వీకెండ్ అఖిల్ ఇంటి పయనం పడుతాడా? లేదా చివరి నిమిషంలో పుంజుకొని నిలబడుతాడా అన్నది చూడాలి. శుక్రవారం రాత్రి వరకు వోటింగ్ ఉంటుంది.

మొత్తానికి మోనాల్ టాప్ 5 లో వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆమె వరుసగా నాలుగు వారాలు ఎలిమినేషన్ ప్రమాదం నుంచి తప్పించుకొంది.

Advertisement
 

More

Related Stories