అల్లరి నరేష్… 2 నెలల్లో 2 చిత్రాలు

TeluguCinema Team 27 Oct 2025
Allari Naresh

అల్లరి నరేష్ కామెడీ సినిమాల పంథా వీడి సీరియస్ పాత్రలు, సినిమాల వైపు వచ్చారు. ఐతే, విజయాల శాతం మాత్రం మిశ్రమంగా ఉంది. మొదట ఒకట్రెండు సినిమాలు వర్కువట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఏవి సరిగా ఆడలేదు. అయినా, అటు కామెడీ చిత్రాల వైపు వెళ్లలేక ఇదే పద్దతిలో వెళ్తున్నాడు.

తాజాగా ఆయన నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ముందుగా రానున్న చిత్రం… 12 రైల్వే కాలనీ. ఈ సినిమా వచ్చే నెల 21న విడుదల కానుంది.

ఇక జనవరి 1న “ఆల్కహాల్” అనే సినిమా విడుదల కానుంది. అంటే రెండు నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలు విడుదల అవుతాయి. రెండూ కూడా వైవిధ్యమైన చిత్రాలే. మరి నరేష్ కి ఈ రెండు సినిమాలతోనైనా కెరీర్ ట్రాక్ లో పడుతుందా అనేది చూడాలి.

హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా నరేష్ కి సినిమాలు వస్తున్నాయి. కానీ అపజయాలు పెరుగుతున్న కొద్దీ అవకాశాలు తక్కువ అయిపోతాయి. ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాక అతని కెరీర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News