పుష్పరాజ్, శీలావతి క్రాస్ ఓవర్

TeluguCinema 04 Sep 2025
Allu Arjun gets on a call with Anushka Shetty

‘ఘాటీ’ సినిమాను చాలామంది ‘పుష్ప’ మూవీతో పోలుస్తున్నారు. పుష్పరాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తే, శీలావతి గంజాయి అక్రమ రవాణా చేస్తుంది. దీంతో ఈ సినిమాను ‘పుష్ప’కు ఫిమేల్ వెర్షన్ గా చాలామంది చూస్తున్నారు.

దీనిపై ఇటు అల్లు అర్జున్, అటు అనుష్క ఒకేసారి స్పందించారు. ‘ఘాటీ’ సినిమా ప్రచారంలో భాగంగా అనుష్క, బన్నీ మాట్లాడుకున్న ఆడియో టేపును విడుదల చేశారు. ఇందులో ఈ క్రాస్ ఓవర్ చర్చకు వచ్చింది.

ఒకవేళ ‘ఘాటీ’, ‘పుష్ప’సినిమాల్ని మిక్స్ చేసి తీస్తే దానికి సుకుమార్ దర్శకుడిగా ఉంటే బాగుంటుందా లేక క్రిష్ డైరక్టర్ అయితే బాగుంటుందా అనేది చర్చ. దీంతో స్వీటీ ఆలోచనలో పడింది.

వెంటనే అల్లు అర్జున్ అందుకున్నాడు. క్రాస్ ఓవర్ సినిమాను కూడా రెండు భాగాలు చేసి, ఒక భాగాన్ని క్రిష్, మరో భాగాన్ని సుకుమార్ డైరక్ట్ చేస్తే బాగుంటుందని అన్నాడు. దానికి అనుష్క కూడా ఓకే చెప్పేసింది. ఇలా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది.