అల్లు అర్జున్ అలా పడిపోయాడేంటి?

Allu Arjun

హీరోగా అల్లు అర్జున్ గ్రాఫ్ పైకి ఎగబాకుతోంది. ‘అల వైకుంఠపురంలో’ వంటి రికార్డు హిట్ తర్వాత తన పాపులారిటీని మరింత పెంచుకునేందుకు బన్నీ ‘పుష్ప’ సినిమాని పాన్ ఇండియా సినిమాగా మలిచారు. పెద్ద ఎత్తున విడుదల కానున్నాయి ‘పుష్ప’ సినిమా రెండు భాగాలు. ఐతే, అల్లు అర్జున్ కి హీరోగా స్టార్ డం పెరిగింది కానీ ఆయన అంత ‘డిజైరబుల్’ కాదు అంటోంది హైదరాబాద్ టైమ్స్ పత్రిక.

హైదరాబాద్ టైమ్స్ పత్రిక 2020వ సంవత్సరానికి గాను 30 మంది సెలెబ్రిటీలతో కూడిన డిజైరబుల్ మెన్ లిస్ట్ ని ప్రచురించింది. ఇందులో అల్లు అర్జున్ స్థానం 16. టాప్ టెన్ లో కూడా చోటు సంపాదించుకోకపోవడం విచిత్రమే.

విజయ్ దేవరకొండ, రామ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగ శౌర్య, నాగ చైతన్య … వీరంతా టాప్ 10లో ఉండగా… బన్నీ 16వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అల్లు అర్జున్ ప్రస్తుతం తన బాక్సాఫీస్ రేంజ్ ని పెంచుకునే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభాస్ ఎలా ఐతే నేషనల్ లెవల్ స్టార్ అయ్యారో తాను కూడా అలా కావాలని ప్రయత్నం చేసున్నారు బన్నీ.

Advertisement
 

More

Related Stories