
లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, రష్మిక ప్రధాన పాత్రల్లో ఒక హిందీ సినిమా రూపొందుతోంది. ‘గుడ్ బై’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ షురూ అయింది. అమితాబ్, రష్మిక సెట్స్ లో ఉన్న ఒక ఫోటో బయటికి వచ్చింది. ఇది వైరల్ అయింది.
రష్మిక ఈ సినిమాలో అమితాబ్ కి కూతురిగా నటిస్తుందని టాక్. కానీ మేకర్స్ ఎలాంటి సమాచారం తెలపడం లేదు. ఈ సినిమాలో అమితాబ్ కి భార్యగా నటిస్తున్నట్లు ఇప్పటికే సీనియర్ నటి నీనా గుప్తా తెలిపింది. ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారిగా అమితాబ్ సరసన నటిస్తున్నాను అని ఆనందంగా చెప్పారు నీనా.
రష్మికకి ఇది బాలీవుడ్ లో రెండో మూవీ. మొదటి చిత్రం ‘మిషన్ మజ్ను’ కూడా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. ఈ రెండు విడుదలై హిట్ అయితే ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఆమె ముంబైలో ఒక అపార్ట్ మెంట్ ని రెంట్ తీసుకొంది. కెరీర్ పుంజుకుంటే ముంబైలో ఇల్లు కూడా కొనుక్కోవాలనే ఆలోచనలో ఉందట.