రెస్టారెంట్ బిజ్ లోకి ఆనంద్

Anand Deverakonda

దేవరకొండ ఫామిలీకి బిజినెస్ లో బాగానే పట్టున్నట్లుంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే రౌడీవెర్ అనే ఫ్యాషన్ బిజినెస్, అలాగే సినిమా నిర్మాణం, దాంతో పాటు ఆహా ఆప్ లో పార్ట్నర్ షిప్… ఇలా చాలా రకాల పెట్టుబడులు ఉన్నాయి.

ఆయన తమ్ముడు కూడా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. “మిడిల్ క్లాస్ మెలోడీస్” సినిమా విజయం సాధించడంతో, ఆ సినిమా ద్వారా వచ్చిన పారితోషికాన్ని ఇప్పుడు వ్యాపారంలో పెట్టుబడి పెడ్తున్నాడు.

హైదరాబాద్ ఖాజాగూడలో తన స్నేహితులు నిర్వహిస్తున్న “గుడ్ వైబ్స్ ఓన్లీ” కేఫ్ లో పార్టనర్ అయ్యాడు ఈ కుర్ర హీరో.

చదవండి: మిడిల్ క్లాస్ రివ్యూ

“నేను మా అన్నయ్య విజయ్ ఇద్దరం ఫుడ్ బేస్డ్ మూవీస్ తోనే మంచి సక్సెస్ అందుకున్నాం. “మిడిల్ క్లాస్ మెలొడీస్”ద్వారా వచ్చిన నా రెమ్యునరేషన్ ను ఈ ఫుడ్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను,” అన్నాడు ఆనంద్.

Advertisement
 

More

Related Stories