బీజేపీలోకి బండ్ల… ఉత్త పుకారే!

Bandla

తనకు రాజకీయాలకు సంబంధం లేదని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు బండ్ల గణేశ్. అంతేకాదు..తన పాత కామెంట్స్ ను ఫ్రెష్ గా వైరల్ చేయొద్దంటూ రీసెంట్ గా రిక్వెస్ట్ కూడా చేశాడు. అయినప్పటికీ అతడి పొలిటికల్ రీఎంట్రీపై 2 రోజులుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

దీంతో బండ్ల మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని మరోసారి స్పష్టంచేశాడు ఈ నటుడు కమ్ నిర్మాత.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బండ్ల పొలిటికల్ రీఎంట్రీపై మరోసారి పుకార్లు ఊపందుకున్నాయి. విజయశాంతి తరహాలోనే బండ్ల కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరతారని, హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తారని ప్రచారం జరిగింది.

ఈ ప్రచారాన్ని తాజాగా బండ్ల తిప్పికొట్టాడు. తను రాజకీయాలకు శాశ్వతంగా దూరం అని చెప్పేశాడు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. “కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పంపిస్తాం… కాంగ్రెస్ దే అధికారం… అలా జరగకపొతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో గుండు కొట్టించుకుంటా,” అని తీన్మార్ వేశాడు ఈ తీన్మార్ నిర్మాత. రిజల్ట్ వచ్చాక కళ్ళు బైర్లు కమ్మి …. కేసీఆర్ ని పొగడడం మొదలుపెట్టాడు. ఇక పాలిటిక్స్ అంటేనే వణుకుతున్నాడు. అలాంటిది ఇప్పుడు GHMC ఎన్నికల కోసం బీజేపీలో చేరే బుద్ది తక్కువ ప్లాన్ వేస్తాడా?

Advertisement
 

More

Related Stories