వ్యాక్సిన్ తీసుకున్న అనుపమ

Anupama


హీరోయిన్లు అందరూ షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికే షూటింగ్ లకు అనుమతి ఉంది. దాంతో షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టే ముందు హీరోలు, హీరోయిన్లు వ్యాక్సిన్ లు తీసుకుంటున్నారు. లేటెస్ట్ గా ఈ జాబితాలో చేరింది అనుపమ పరమేశ్వరన్.

అనుపమ ఈ రోజు మొదటి వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు అప్డేట్ చేసింది.

అనుపమ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఒకటి బన్నీ వాసు, సుకుమార్ కలిసి నిర్మిస్తోన్న ’18 పేజెస్’, మరోటి చందూ మొండేటి రూపొందిస్తోన్న ‘కార్తికేయ 2’. ఈ రెండింటిలోనూ హీరో నిఖిల్ సిద్ధార్థే. ఒకే హీరోతో వరుసగా రెండు సినిమాలు చేయడం విశేషం. ఈ సినిమాల షూటింగులు జులై మొదటి వారంలో మళ్ళీ మొదలు కానున్నాయి.

Advertisement
 

More

Related Stories