మలయాళం వైపు అనుష్క చూపు

TeluguCinema 02 Sep 2023
Anushka Shetty

అనుష్కశెట్టి ప్రస్తుతం సినిమాలు పెద్దగా ఒప్పుకోవడం లేదు. రెండేళ్లకో సినిమా చేస్తోంది తెలుగులో. ఆమె నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో ఆ తర్వాత ఏంటి అనేది క్లారిటీ లేదు.

ఐతే మలయాళంలో రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. అందులో ఒకటి కథానార్ “Kathanar, The Wild Sorcerer”. ఇది కూడా హారర్ థ్రిల్లర్. భాగమతి తరహాలో సాగే మూవీ. ఈ సినిమా ఆమె చాలా నెలల క్రితమే ఒప్పుకొంది. ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది.

మరో మలయాళం సినిమా కూడా చర్చల దశలో ఉందట.