అషుకి ‘పోకిరి’ కాల్స్!

- Advertisement -
Ashu Reddy

బాగా నచ్చిన హీరో, హీరోయిన్ ఫోన్ నంబర్ కావాలని, వారికి ఫోన్ చెయ్యాలని తహ తహలాడుతుంటారు చాలా మంది. ఎవరి దగ్గరినో సంపాదించి సెలెబ్రిటీలకు ఫోన్లు చేసే వారి సంఖ్య ఎక్కువే. అందుకే, సెలెబ్రిటీలు తమ మొబైల్ లో ఫీడ్ అయిన నంబర్లను తప్ప మిగతా వాటిని అస్సలు పట్టించుకోరు.

ఐతే, తాజాగా ఒక న్యూస్ ఛానెల్ కనీస విలువలు పాటించకుండా ఒక హీరోయిన్ నంబర్ ని ఛానెల్ లో ప్రసారం చేసింది. ఇక అందాల భామ నంబర్ దొరికితే కుర్రాళ్ళు ఊరుకుంటారా? అదే సమస్య ఎదుర్కొంటున్నాను అంటోంది అషు రెడ్డి.

డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ నిర్మా త కేపీ చౌదరి కేసులో అషురెడ్డి పేరు వచ్చింది. ఆమె గురించి న్యూస్ ప్రసారం చేస్తూ ఒక ఛానెల్ ఆమె నంబర్ ని (Ashu Reddy Phone Number) చూపింది. “నా ఫోన్ నంబర్ ని ప్రసారం చేసినప్పటి నుంచి నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. ప్రతి సెకండ్ కి ఒక కాల్ వస్తోంది,” అంటూ ఆమె తన మొబైల్ కి వచ్చిన కాల్స్ లిస్ట్ ని చూపింది ఒక వీడియోలో.

ఇక ఈ ఫోన్ వాడలేను అంటోంది అషు రెడ్డి. అలా ఉంది పోకిరిల తాకిడి.

ALSO READ: Ashu Reddy to fight back by filing a defamation suit!

 

More

Related Stories