‘అల్లు అర్జున్ బంగారు బాతు’

- Advertisement -
Allu Arjun


నాగచైతన్య, సమంత విడిపోతారని గతంలో జోస్యం చెప్పిన వేణు స్వామి ఈ సారి మరికొందరు సినిమా తారల జాతకాలు చెప్పారు. ఈ వేణు స్వామి గత ఆరేడేళ్లుగా సోషల్ మీడియాలో ప్రముఖల జాతకాలు చెప్తూ హడావిడి చేస్తున్నారు. బాలీవుడ్ లో కేఆర్కే వంటి కొందరు క్రిటిక్స్ తాము చెప్పిందే నిజమైంది అని సినిమా ఫలితాలను, తమ రేటింగ్స్ తోసి పోల్చి డబ్బాలు కొట్టుకున్నట్లు ఈ వేణు స్వామి ఇలాంటి హంగామా చేస్తుంటారు.

కేసీఆర్, చంద్రబాబు అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తారని 2017లో సొల్లు జోస్యం చెప్పింది ఈయనే. రెండు నెలల్లో కవిత మంత్రి పదవి చేపడుతారని నాలుగేళ్ళ క్రితం చెప్పిన ఆస్ట్రాలజర్ ఇతనే. కాకపోతే, సమంత, నాగ చైతన్య విడిపోతారని చెప్పింది నిజం కావడం, కొన్ని సినిమాల ఫలితాలు నిజం కావడంతో మళ్ళీ ఈయన జోస్యాలకు సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చింది.

లేటెస్ట్ గా ఆయన చెపుతున్న/చెప్పిన భవిష్యత్….

  • ఈ ఏడాది ఇద్దరు తెలుగు హీరోలు ఆరోగ్య సమస్యలతో సినిమాలకు దూరం అవుతారు.
  • అల్లు అర్జున్‌ హవా మామూలుగా ఉండదు. ఆయన నిర్మాతలకు బంగారు బాతు. మరో ఐదేళ్లూ ఆయన ప్రతి సినిమా పాన్ ఇండియా హిట్టు.
  • అఖిల్‌ జాతకంలో నాగదోషం ఉంది… హిట్‌ కొడతాడు కానీ కొందరి ప్రభావం నుంచి బయటికి రావాలి.
  • చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత జాతకం బాగుంది. ఆమె కెరీర్ సూపర్ గా ఉంటుంది.
  • ఇంకో రెండేళ్ళూ టాలీవుడ్‌లో రష్మిక, సమంత, పూజా హెగ్డే ఏలుతారు.
  • కొందరు పెద్ద దర్శకులకు ‘పెద్ద’ విజయాలు ఇక రాకపోవచ్చు.
 

More

Related Stories