అనుష్క పెళ్లి ఫిక్స్ చేసిన జ్యోతిష్కుడు

- Advertisement -

అనుష్క పెళ్లి గురించి చర్చ గత పదేళ్లుగా మీడియాలో నలుగుతోంది. ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతారు అని కూడా ఆ మధ్య పుకారు షికారు చేసింది. కానీ, ఇది నిజం కాదు ఆమె పెళ్లి చేసుకుంటారు అని అంటున్నారు ఒక జ్యోతిష్కుడు. పండిత్ జగన్నాధ్ గురూజీ అనే జ్యోతిష్కుడు చాలా కాలంగా సెలెబ్రిటీలకు జాతకాలు చెప్తున్నారు.

ఆయన చెప్తున్న దాని ప్రకారం… ఆమె పెళ్లి త్వరలోనే ఉంటుందట. వచ్చే ఏడాదిలోనే జరగొచ్చు అనేది పండిత్ జగన్నాధ్ గురూజీ మాట. 2023 జనవరిలోపు ఆమెకి పెళ్లి జరిగి తీరుతుందని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. అవివాహితగా ఆమె మిగిలిపోయే ఛాన్స్ లేదట. ఆమె జాతకంలో పెళ్లి ముచ్చట ఉందని ఈ గురూజీ సెలవిస్తున్నారు. మరి అందుకే ఆమె సినిమాలు ఒప్పుకోవట్లేదా ?

39 ఏళ్ల అనుష్క రెండేళ్లుగా సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంటున్న మాట వాస్తవం. ఆమె బాగా లావు పెరగడం వల్లే సినిమాల్లో నటించడం లేదన్న మాట ఆ మధ్య వినిపించింది. రీసెంట్ గా ఆమె కొంచెం తగ్గిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. మరి, ఆమె బరువు తగ్గింది సినిమాలో రీ ఎంట్రీ కోసమా? లేక పెళ్లి కోసమా?

అనుష్క ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోతోందని చాలా కాలం పుకార్లు షికార్లు చేశాయి. కానీ, ఇద్దరూ ఆ ప్రచారం తప్పని చెప్పారు. ఆ తర్వాత ఆమె దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఏవి నిజం కాలేదు. మరి ఈ జ్యోతిష్కుడి ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందా?

 

More

Related Stories