మిలియన్ దాటేసిన భీమ్లానాయక్!

Bheemla Nayak


అమెరికాలో ‘భీమ్లానాయక్’ ఊపేస్తోంది. గత రెండేళ్లలో ఏ సినిమాకి మొదటి రోజే వన్ మిలియన్ డాలర్ల వసూళ్లు అందలేదు. కరోనా కారణం మెయిన్ అని చెప్పాలి. ‘పుష్ప’, ‘జాతిరత్నాలు’, ‘అఖండ’ వంటి సినిమాలు మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు అందుకున్న మాట వాస్తవమే. కానీ వాటికి మొదటి రోజు వచ్చింది చాలా తక్కువ. అవి మిలియన్ డాలర్ మార్కు దాటడానికి చాలా ఎక్కువ రోజుల టైం తీసుకున్నాయి.

పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ ప్రీమియర్ షోలతో 8.7 లక్షల డాలర్లు అందుకొంది. మొదటి రోజు మొదటి గంట అడ్వాన్స్ బుకింగ్ తోనే మిలియన్ డాలర్ మార్కుని దాటేసింది.

‘భీమ్లా నాయక్’ ఫైనల్ గా ఎంత వసూళ్లు అందుకుంటుంది అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ట్రెండు మాత్రం బాగుంది.

దర్శకుడు ఎవరైనా పవన్ కళ్యాణ్ సినిమాలకు అమెరికాలో ఓపెనింగ్ బాగుంటుంది. పవన్ కున్న క్రేజ్ అలాంటిది. ఇక త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో చేతులు కలిపితే ఆ ఊపు వేరుగా ఉంటుంది. ‘భీమ్లానాయక్’ సీరియస్ సినిమా. ఎంటర్ టైన్మెంట్ తక్కువ. అయినా కూడా ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది.

Advertisement
 

More

Related Stories