కన్నడనాట సినీ రాజకీయం

కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ గెలిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి అని సర్వేలు చెప్తున్నాయి. దాంతో, ఈ సారి గెలిచేందుకు సినిమా గ్లామర్ ని కూడా బాగా వాడనుంది బీజేపీ.

ఈ క్రమంలో ప్రముఖ కన్నడ హీరో సుదీప్ కి తమ పార్టీ జెండా కప్పనుంది. ఈ రోజు హీరో సుదీప్, మరో అగ్ర హీరో దర్శన్ బీజేపీలో చేరుతున్నారు. వీరు ఇద్దరూ కర్ణాటకలో పెద్ద హీరోలు. మాస్ లో ఫాలోయింగ్ ఉంది.

సుదీప్ కి ఇతర భాషల్లో కూడా పాపులారిటీ ఉంది. కర్ణాటకలో అంబరీష్ వంటి స్టార్స్ రాజకీయనాయకులుగా కూడా పేరుతెచ్చుకున్నారు. అంబరీష్ భార్య, ప్రముఖ నటి సుమలత కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఐతే, హీరోయిన్ల కన్నా హీరోలతో ప్రచారం చేయించడం, వారిని తమ పార్టీలోకి తీసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది అని బీజేపీ భావిస్తోంది.

కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువశాతం మంది హీరోలు బీజేపీ సానుభూతిపరులే.

Advertisement
 

More

Related Stories