
“సూర్యని డైరెక్ట్ చేయబోతున్న బోయపాటి”, “కేజీఎఫ్ హీరో యష్ తో బోయపాటి”, “పవన్ కళ్యాణ్ తో పవన్ కళ్యాణ్”…. ఇలాంటి వార్తలు ఈ మధ్య షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలను బోయపాటి రాయించుకుంటున్నారా? లేక ఆయన పీ.ఆర్ టీం హడావిడి చేస్తోందా అన్న అనుమానాలు వస్తున్నాయి.
బోయపాటి మాస్ డైరెక్టర్. ఆయన ఖాతాలో పెద్ద హిట్స్ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఆయన కెరీర్ ని చూస్తే… సినిమా విడుదలైన తర్వాత హీరోల డేట్స్ కోసం ఆయన ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. బాలయ్య తప్ప ఏ హీరో వెంటనే ఆయనకు ఓకే చెప్పిన దాఖలాలు తక్కువ.
ప్రస్తుతం తీస్తున్న ‘అఖండ’ సినిమా షూటింగ్ కూడా పూర్తికాక ముందే… ఆయనకీ అంత పెద్ద బడా హీరోలు ఓకే చెప్తారా? నిజానికి అల్లు అర్జున్ ఈ మధ్య బోయపాటిని పిలిపించుకొని మళ్ళీ సినిమా చేద్దామని చెప్పాడు. ‘పుష్ప’ మొదటి భాగం పూర్తి అయిన వెంటనే బోయపాటితో ఉంటుందేమో అన్నట్లుగా హడావిడి జరిగింది. కానీ ఏమైందేమో బన్నీ …బోయపాటితో బదులు ‘వకీల్ సాబ్’ వేణు శ్రీరామ్ తో వెళ్తున్నాడు. వేణు శ్రీరామ్ తీసే ‘ఐకాన్’ సినిమా త్వరలోనే మొదలుకానుంది.
బన్నీతో నెక్స్ట్ సినిమా ఇప్పట్లో కాదు అని తేలిన తర్వాతే బోయపాటి ఇలా పెద్ద హీరోల పేర్లతో కాంబినేషన్ న్యూస్ లు లీకులు చేయించుకున్నట్టు గుసగుస.