ఇక ‘బ్రో’ ప్రమోషన్ మొదలు

Bro


పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్నారు. ఐతే, వర్షాల కారణంగా బ్రేక్ పడింది. మరోవైపు, ఆయన నటించిన ‘బ్రో’ సినిమా విడుదలకు ఇంకా నెల మాత్రమే టైం ఉంది. ఇంకా ప్రమోషన్ మొదలు కాలేదు. ఒక్క రెండు, మూడు రోజుల పని మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన పని కొత్త మిగిలి ఉంది. పవన్ కళ్యాణ్ తన షూటింగ్ మొత్తం పూర్తి చేశాకే ‘వారాహి’ యాత్ర మొదలు పెట్టారు.

జులై 1 నుంచి ఈ సినిమా పబ్లిసిటీ మొదలు పెట్టాలని భావిస్తోంది టీం. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి తప్ప మిగతా ఎలాంటి ప్రమోషన్ కి పవన్ కళ్యాణ్ రారు. సో, సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఖని, హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ తో పబ్లిసిటీ ఈవెంట్స్ చెయ్యాలని అనుకుంటున్నారు.

ముందుగా టీజర్, ఆ తర్వాత పాట విడుదల చేస్తారట. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది పవన్ కల్యాణ్ ఇచ్చే టైంని బట్టి ఆధారపడి ఉంటుంది.

‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా సాయి ధరమ్ తేజ ఒక బైక్ రేసర్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ ఉండదు. కాకపొతే ఒక సాంగ్ లో మాత్రం పవన్ కళ్యాణ్ ఐటెం గాళ్ ఊర్వశి రౌటేలాతో డ్యాన్స్ చేస్తారు. జులై 28న విడుదల కానుంది ‘బ్రో’.

Advertisement
 

More

Related Stories