వీక్ డేస్ లో మరీ వీక్!

రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీసిన “కూలీ” మొదటి వీకెండ్ భారీ మొత్తంలో వసూళ్లు పొందింది. దాంతో, ఇది బ్లాక్ బస్టర్ గా అవతరించింది అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి వీకెండ్ తర్వాత అసలు విషయం బయటపడింది.
వసూళ్లలో సోమవారం చాలా డ్రాప్ కనిపించింది. మంగళవారం మరింత క్షీణించింది. మళ్ళీ రెండో వీకెండ్ పుంజుకోవచ్చు. కానీ వీక్ డేస్ లో మాత్రం వసూళ్లు మరీ వీక్ గా ఉండడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. మన దేశంలో ఈ సినిమా వసూళ్లు 200 కోట్లు దాటాయి. అమెరికాలో కూడా భారీ వసూళ్లు పొందింది. ఐతే, ఈ సినిమా కనీసం 600 కోట్లు అందుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ కాదు.
“కూలీ” సినిమా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే… కలెక్షన్ల ఫిగర్ భారీగా కనిపిస్తున్నా లాభం వచ్చేలా లేదు. “వార్ 2” ఫ్లాప్ అయినా దీనికి అదనంగా ఎలాంటి బెనిఫిట్ కలగడం లేదు.
మొత్తంగా చూస్తే “కూలీ” ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. అంచనాలను అందుకోవడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు.