కొత్త లుక్ లో మెస్మరైజ్ చేస్తాడట

TeluguCinema Team 19 Aug 2025
Ram Charan with stylist Aalim Hakim

రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం… ‘పెద్ది’. ఇందులో కొత్త లుక్ లో కనిపించబోతున్నారు రామ్ చరణ్. స్టైలిస్ట్ ఆలీం హకీం రామ్ చరణ్ కోసం స్పెషల్ కేర్ తీసుకొని సరికొత్త లుక్ లో ప్రెజంట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ స్టైల్, స్వాగ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేయనున్నారు.

రీసెంట్ గా స్టైలిస్ట్ ఆలీం హకీం, రామ్ చరణ్ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వెంకట సతీష్ కిలారు తనవృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సుకుమార్ కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి.

వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది పెద్ది.

జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇక శివరాజ్ కుమార్జ, గపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మాస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News