ఆయనకి అన్ని తెలుసు: దీపిక

TeluguCinema 09 Feb 2022
Deepika

దీపిక పదుకొను నటించిన ‘గెహరియా” సినిమా ఫిబ్రవరి 11న డైరెక్ట్ గా అమెజాన్ లో విడుదల కానుంది. ఈ సినిమా… వివాహేతర సంబంధాల గురించి. ఇందులో దీపిక వర్ధమాన హీరో సిద్ధాంత్ చతుర్వేది హాట్ హాట్ గా నటించింది. ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలు ఫుల్లుగా ఉన్నాయి అని ట్రైలర్ బట్టి అర్థం అవుతోంది.

ట్రైలర్ విడుదలనప్పటి నుంచి దీపిక విమర్శలు ఎదుర్కొంటోంది. మీ ఆయనకి చెప్పే అలాంటి సీన్లు చేశావా అంటూ ఆమెకి కామెంట్స్ పెడుతున్నారు ట్రోలర్స్.

“యక్. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాటి గురించి చర్చిస్తున్నామా. ఆయన ఒక నటుడు. నేను నటి. మాకు సినిమా సీన్ల గురించి తెలియదా. మా ఆయన పర్మిషన్ అవసరం లేదు. ఆయనకి అన్ని తెలుసు,” అని సమాధానం ఇచ్చింది.

రణవీర్ సింగ్ ఇప్పటికే సినిమా చూశాడట. దీపిక నటనకి ఫిదా అయ్యాడట.