‘కింగ్’తో దీపిక ఆరో సినిమా

TeluguCinema 20 Sep 2025
Deepika Padukone

దీపిక పదుకోన్ ప్రస్తుతం వార్తల్లో ఉంది. “కల్కి 2″లో ఆమె నటించడం లేదని వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించినప్పటి నుంచి దీపిక గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. పారితోషకం, పనిగంటల విషయంలో ఆమె పెట్టిన డిమాండ్లు వల్లే ఆమెని తొలగించారు అని అంటున్నారు. ఆమెని ఇంతకుముందు ‘స్పిరిట్’ సినిమా నుంచి కూడా వద్దనుకున్నారు.

ఐతే తాజాగా ఆమె షారుక్ ఖాన్ సరసన ఒక కొత్త సినిమా ఒప్పుకొంది. . “కింగ్” పేరుతో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు మొదలైంది.

“పొందే విజయం కన్నా ఒక టీంతో పనిచేస్తే కలిగే మంచి అనుభూతులు ముఖ్యమని నా మొదటి చిత్రం ఓం శాంతి ఓం అప్పుడే నాకు షారుక్ ఖాన్ చెప్పారు. ఇది నా ఆరో చిత్రం షారుక్ తో,” అని ఆమె రాసుకొంది.

కల్కి టీంతో అలాంటి మంచి అనుభూతులు లేవని ఇన్ డైరెక్ట్ గా విమర్శించింది.

ALSO READ: Deepika Padukone takes a sly dig at ‘Kalki 2898 AD’ team

షారుక్ తో ఆమె చేసిన చిత్రాలు ఇవే….

  1. ఓం శాంతి ఓం
  2. చెన్నై ఎక్స్ ప్రెస్
  3. హ్యాపీ న్యూ ఇయర్
  4. పఠాన్
  5. జవాన్
  6. కింగ్ (నిర్మాణంలో ఉంది)