పెళ్లి మాట ఎత్తొద్దు ప్లీజ్

TeluguCinema 12 Jun 2023
tamannah stills 120623 007

పెళ్లి మాట ఎత్తొద్దు ప్లీజ్

తమన్న ఇప్పుడు ఏ సినిమా గురించి ప్రచారం చేసినా ఆమె అనివార్యంగా పెళ్లి ప్రస్తావన ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక ఆమె తాజాగా నటించిన రెండు వెబ్ సిరీస్ లు కూడా ‘పెళ్లి’ చుట్టే తిరుగుతాయి. దాంతో, ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు ఇంకా ఎక్కువ ఎదురవుతున్నాయి. ఐతే, నా పర్సనల్ విషయాలు కాకుండా వెబ్ సిరీస్ గురించి మాత్రమే మాట్లాడుదామని మీడియాని కోరుతోంది.

తమన్న ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది. ఇద్దరూ అనేక చోట్లా మీడియా కంటపడ్డారు. ఐతే, విజయ్ వర్మని ఈ అమ్మడు పెళ్లి చేసుకుంటుందా అనేదే అందరిలో ఉన్న ప్రశ్న. ఆ ప్రశ్న మాత్రం అడగొద్దు అంటోంది.

ఆమె తాజాగా హిందీలో “జీ కర్దా”, “లస్ట్ స్టోరీస్ 2” అనే రెండు వెబ్ సిరీస్ లలో నటించింది. రెండూ విడుదలకు సిద్ధమైన తరుణంలో వాటి ప్రమోషన్ లలో పాల్గొంటోంది. ఇక “లస్ట్ స్టోరీస్ 2″లో ఆమె సరసన ఆమె బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ నటించాడు. సో అతనికి కూడా ఈ ప్రశ్న ఎదురవుతోంది.

ALSO CHECK: Tamannaah turns sassy