
ఇషా రెబ్బా అచ్చ తెలుగు హీరోయిన్. సోకుల షో చెయ్యడంలో ముందుంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో 20 లక్షల ఫాలోవర్స్ కి చేరువలో ఉంది. ఇంత పాపులారిటికి కారణం ఆమె ప్రతిరోజూ పెట్టే హాట్ హాట్ ఫొటోలే. సూర్యుడు నిత్యం ఉదయిస్తాడన్నది ఎంత నిజమో ఆమె రోజూ కొత్త ఫోటోలు అప్డేట్ చేస్తుంది అనేది అంతే సత్యం. అలా ఉంటుంది ఆమె ఫోటోషూట్ ల దూకుడు.
సోషల్ మీడియాలో ఎంత సందడి చేసినా తెలుగు సినిమా పరిశ్రమ ఆమె టాలెంట్ ని గుర్తించడం లేదు. పెద్దగా అవకాశాలు ఇవ్వట్లేదు. అందుకే కాబోలు తమిళంలో లక్ ని పరీక్షించుకోవాలనుకుంటోంది.
లేటెస్ట్ గా తన తమిళ సినిమా అవకాశాల కోసం, ఇంటర్వ్యూల కోసం వీరిని సంప్రదించాలని మేనేజర్ల, పీఆర్వోల డీటెయిల్స్ ని సోషల్ మీడియా వేదికపై తెలిపింది. అంటే అక్కడ కెరీర్ ని బిల్డ్ చేసుకుందామని అనుకుంటోందన్నమాట.
Also Check: Eesha Rebba in a black top