F3 మరోసారి వాయిదా?

F3


వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన “ఎఫ్ 3” సంక్రాంతి బరి నుంచి తప్పుకొని ఫిబ్రవరి 25కి తన విడుదల తేదీగా ఫిక్స్ చేసుకొంది. ఇటీవలే ఆ కొత్త డేట్ ని ప్రకటించింది టీం. తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

“ఫిబ్రవరిలోనే వస్తామో, వేసవి సెలవుల్లో వస్తామో ఇప్పుడే చెప్పలేం. కాకపొతే, ఎఫ్ 3 థియేటర్లలోనే విడుదలవుతుంది,” అని ఇటీవల వెంకటేష్ చెప్పడం విశేషం. ఫిబ్రవరి 25న సినిమా విడుదలవుతుందన్న నమ్మకం వెంకీలో కనిపించడం లేదు.

ఇది “ఎఫ్ 2” సినిమాకి సీక్వెల్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. శిరీష్, దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ ఇది.

Advertisement
 

More

Related Stories