‘లైగర్’కి ముందే బోలెడన్ని బాక్సింగ్ చిత్రాలు

- Advertisement -
Liger


బాక్సింగ్‌ నేపథ్యంగా సినిమా కథల ఉదృతి పెరిగింది. ‘లైగర్’ సినిమాని భారీ ఎత్తున ప్లాన్ చేశారు పూరి జగన్నాధ్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన ‘లైగర్’ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ సినిమా కన్నా ముందే బాక్సింగ్ సినిమాలు విడుదలయ్యాయి.

ఫరాన్‌ అక్తర్‌ – రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రాల ‘తుఫాన్‌’ అమెజాన్ లో డైరెక్ట్ గా విడుదలైంది. తమిళ్ హీరో ఆర్య నటించిన ‘సార్‌పట్ట’ కూడా ఈ నెలలోనే రిలీజ్ కానుంది. ఈ రెండూ ప్యూర్ బాక్సింగ్ మూవీస్.

ఇక తెలుగులో కూడా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న బాక్సింగ్ మూవీ ‘గని’ కూడా ‘లైగర్’ కన్నా ముందే విడుదలయ్యేలా ఉంది. అంటే, విజయ్ దేవరకొండ మూవీ వచ్చేసరికి ప్రేక్షకుల్లో ‘బాక్సింగ్’ చిత్రాల ఫెటీగ్ వస్తుందా అన్నది డౌట్? ఐతే, ఈ సినిమాని థియేటర్లోనే విడుదల చేస్తే సమస్య ఉండదు. ఎందుకంటే ‘తుఫాన్‌’, ‘సార్‌పట్ట’ ఓటిటి వేదికపై వచ్చినవి. థియేటర్లో విడుదల కాలేదు.

More

Related Stories