‘గ్లోబ్ ట్రాట్టర్’కి కొత్త టైటిల్!

రాజమౌళి తన సినిమాలకు కథని ప్రతిబింబించే క్యాచీ టైటిల్స్ పెడుతుంటారు. ‘ఈగ’ చుట్టూ తిరిగే కథ కాబట్టి ఈగ. బాహుబలి పేరు హీరోల పాత్రల పేర్ల కారణంగా వచ్చింది. మగధీర, విక్రమార్కుడు వంటివి కథకు తగ్గట్లుగానే పెట్టినవి. ఐతే, “ఆర్ ఆర్ ఆర్” మాత్రం పాన్ ఇండియా రీచ్ కోసం పెట్టిన “కుకుడ్” నేమ్. ఇప్పుడు ఆయన గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని మహేష్ బాబుతో భారీ చిత్రం తీస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని నవంబర్లో ప్రకటిస్తామని ఇప్పటికే రాజమౌళి తెలిపారు.
నెల రోజుల టైం ఉంది జనానికి టైటిల్ ఏంటో తెలియడానికి. కానీ ఇప్పటికే అభిమానులు ఒక కొత్త పేరుని సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ సినిమాని ఇప్పటివరకు “గ్లోబ్ ట్రాట్టర్” (‘GlobeTrotter’)గా పరిగణిస్తున్నారు. అలాగే ఇది మహేష్ బాబు 29వ చిత్రం కాబట్టి #SSMB29గానూ పిలుస్తున్నారు. ఐతే అసలు టైటిల్ మాత్రం వచ్చే నెల తెలుస్తుంది.
అభిమానుల సోషల్ మీడియా పోస్టుల ప్రకారం ‘వారణాసి’ అనే టైటిల్ ని రాజమౌళి లాక్ చేశాడట. ఇంతకుముందు “రుద్ర” అని కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి.“మహారాజా”, “చక్రవర్తి” టైటిల్స్ కూడా ఇంతకుముందు పరిశీలించారు. ఐతే, ఇటీవలే విజయ్ సేతుపతి సినిమాకి మహారాజ టైటిల్ వాడేశారు. దాంతో దాన్ని పక్కన పెట్టారు.
మరి రాజమౌళి యూనివర్సల్ గా అర్ధమయ్యే “వారణాసి” టైటిల్ నే తీసుకుంటారా లేక మరేదైనా ఆలోచిస్తున్నారా అనేది చూడాలి.