రకుల్ కి హరీష్ శంకర్ మద్దతు

Rakul


రకుల్ ప్రీత్ సింగ్ హర్ట్ అయింది. ఆమెకి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి అని ఒక పత్రిక కథనం ప్రచురించింది. దానికి స్పందించిన రకుల్ తాను ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నానో తెలుసా అంటూ చిరుబుర్రులాడింది. ఆమె హిందీలో 6 సినిమాల్లో నటిస్తోందట. ఏడాదికి 365 రోజులే ఉంటాయి కదా…అందులో ఎన్ని సినిమాలు చేయగలమని రకుల్ ప్రశ్నిస్తోంది. అలా ఆమె బాధపడుతూ రాసిన ట్వీట్ కి దర్శకుడు హరీష్ శంకర్ కూడా స్పందించారు.

అయన స్నేహితుడు కూడా ఇటీవల ఆమెకి కథ చెప్పాడట. ఆమెకి కథ నచ్చినా డేట్స్ లేవని ఆ సినిమా ఒప్పుకోలేదట రకుల్. ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ రకుల్ ఎంత బిజిగా ఉందో తనకు తెలుసు అని ఆమెకి మద్దతుగా ట్వీట్ చేశారు హరీష్ శంకర్.

అంతే కాదు, కెరీర్ లో అలాగే దూసుకుపోయి.. నీ పనితోనే విమర్శకుల నోళ్లు మూయి అని హరీష్ ఆమెకి సలహా ఇవ్వడం విశేషం.

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఒక తెలుగు చిత్రం ఇంకా విడుదలకు నోచుకోవడం లేదు. అందులో ‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్ నటించాడు. క్రిష్ డైరెక్టర్. ఇక హిందీలో ఆమె చేతిలో నిజంగానే 5,6 సినిమాలున్నాయి.

చూడండి: రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఫోటోలు

Advertisement
 

More

Related Stories