ఇకపై అలా ఉండదు

Hebah

హీరోయిన్ హెబా పటేల్ మారిపోయింది. గతంలో మెచ్యూరిటీ లేకపోవడంతో ఏది పడితే అది చేసిందట. ఇప్పుడు అనుభవం నేర్పిన పాఠాలతో ఆమెలో చాలా మార్పు వచ్చింది.

ఇదంతా తన కెరియర్ గురించే. హెబా పటేల్ అనేక సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా కూడా ‘కుమార్ 21F’ తెచ్చిన పేరు తీసుకురాలేదు. నితిన్ నటించిన ‘భీష్మ’ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కూడా కనిపించింది. ఐతే, అదంతా డబ్బు కోసమే చేశాను తప్ప కథలు నచ్చి, పాత్రలు మెచ్చి కాదని కుండబద్దలు కొడుతోంది. ఇప్పుడు మాత్రం, నటిగా సంతృప్తినిచ్చే పాత్రలకోసమే వెతుకుతున్నాను అంటోంది.

ఆమె త్వరలోనే ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే డ్రామాలో కనిపించనుంది. ఇందులో ఆమెది సగటు గృహిణి పాత్ర. పూర్తిగా గ్లామర్ హంగామాకి దూరంగా ఉండే క్యారెక్టర్. ఇలాంటి పాత్రలు, సినిమాలు చేసేందుకే నిరీక్షిస్తోందట. డబ్బు కోసం గ్లామర్ పాత్రలు, నటిగా సంతృప్తి కోసం ఇలాంటి సినిమాలు….ఇది ఆమె పాలసీ.

ఐతే గతంలో చేసినట్లు ఏది పడితే అది ఒప్పుకోదంట. ఇప్పుడు కొంచెం బాధ్యతగా మెలుగుతాను అంటోంది.

Advertisement
 

More

Related Stories