ఎన్టీఆర్ మాటల వెనుక ఆంతర్యం?

TeluguCinema 11 Aug 2025
NTR at War 2 pre release event

నిన్న హైదరాబాద్ లో జరిగిన “వార్ 2” ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? తనని ఎవరూ ఆపలేరు అని ఎన్టీఆర్ అనడం వెనుక కారణం ఉందా? ఈ ప్రశ్నలు అందరిలో కలుగుతున్నాయి.

రజినీకాంత్ నటించిన “కూలీ” సినిమాతో పోటీలో ఉంది ఎన్టీఆర్ నటించిన “వార్ 2.” అడ్వాన్స్ బుకింగ్ ల పరంగా రజినీకాంత్ మూవీ అందనంత దూరంలో ఉంది. పూర్తిగా రజినీకాంత్ సినిమా డామినేషన్ కనిపిస్తోంది. అలాగే, తెలుగునాట కూడా రజినీకాంత్ సినిమాని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు మోస్తున్నారు. తెలుగుదేశం అనుకూల మీడియా, సోషల్ మీడియా కూడా రజినీకాంత్ సినిమాకి ఉన్న హైప్ కి మించి, అవసరానికి మించి లేపుతున్నారు.

“కూలీ” సినిమాలో నాగార్జున కూడా నటించారు. సాధారణంగా నాగార్జున సినిమాని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు పట్టించుకోరు. కానీ “కూలీ” విషయంలో రజినీకాంత్ సినిమాగా ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు కుమారుడు, ఏపీ మంత్రి లోకేష్ కూడా రజినీకాంత్ సినిమా గురించి ప్రత్యేకంగా ట్వీట్ వేశారు.

లోకేష్ ట్వీట్ తర్వాతే ఎన్టీఆర్ ఇలా మాట్లాడాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకే, ఈ స్టేజిపై అలా మాట్లాడారు. “ఆ ఎన్టీఆర్ (తన తాతయ్య) ఆశీస్సులు ఉన్నంతవరకు ఈ ఎన్టీఆర్ ని ఎవరూ ఆపలేరు,” అని జూనియర్ ఘాటుగా అన్నారు.

ALSO CHECK: PHOTOS of War 2 – Pre Release event in Hyderabad

మరోసారి, ఎన్టీఆర్, లోకేష్ మధ్య ఉన్న గ్యాప్ బయటపడింది.