వార్ 2: లైట్ తీసుకున్న హృతిక్

TeluguCinema 04 Oct 2025
NTR and Hrithik Roshan

“వార్ 2” ఘోరంగా పరాజయం పాలు అయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ కి నిరాశపరిచింది. ఐతే, హృతిక్ రోషన్ మాత్రం ఆ సినిమా రిజల్ట్ గురించి లైట్ అంటున్నారు. అంటే అది మర్చిపోయాను అని చెప్తున్నారు.

దర్శకుడు అయాన్ ముఖర్జీ అద్భుతంగా వర్క్ చేశాడనీ, తాను చాలా కష్టపడ్డాను అనీ చెప్పారు హృతిక్. మా ప్రయత్నం బాగా చేసినా సినిమా ఆడలేదని ఎవరినీ బ్లేమ్ చెయ్యను అన్నట్లుగా మాట్లాడారు. దర్శకుడితో అదే స్నేహం మెయిన్ టైన్ చేస్తున్నారు. మొత్తానికి హృతిక్ రోషన్ “వార్ 2” ఫలితం గురించి వర్రీ కావడం లేదు.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన ఈ హిందీ చిత్రం బాగా ఆడి ఉంటే ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ డెవలప్ అయి ఉండేది. అలాగే మరో బడా యాక్షన్ సినిమా వచ్చి ఉండేది. ఇక హృతిక్ కి తెలుగులో మార్కెట్ మరింత పెరిగి ఉండేది.

ఇక ఆయన తన దర్శకత్వంలో “క్రిష్ 4” సినిమా తీయనున్నారు. ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేశారు హృతిక్ రోషన్.

TeluguCinema

View all posts

Recent News