మధుబంతి మొదటి తెలుగు పాట

మధుబంతి బగ్చి …. ఇప్పుడు ఇండియాలో టాప్ సింగర్. ఆమె పాడిన హిందీ పాటలు జనాలని ఊపేస్తున్నాయి. బిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. నిషా ఎక్కించే గొంతులో పాడే ఆమె ఐటెం సాంగ్స్ కి చాలా క్రేజ్ ఉంది.
“స్త్రీ 2″లో ఆమె పాడిన “ఆజ్ కి రాత్” అనే ఐటెం సాంగ్ దాదాపు 800 మిలియన్ల వ్యూస్ పొందింది. ఇది ఒక రికార్డు. అలాగే “ఉయ్ అమ్మా” అనే మరో పాట కూడా ఇటీవల ఊపేసింది. హిందీ వెర్షన్ “పుష్ప 2″లో “పీలింగ్స్” పాడింది ఈమె.
మధుబంతి మొదటి తెలుగు పాట తాజాగా విడుదలైంది. ఆమె తెలుగులో పాడిన మొదటి పాట కూడా ఐటెం సాంగ్. “ఓజీ” సినిమాలో “కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్” అనే పాట పాడింది. ఈ పాటలో నేహా శెట్టి డ్యాన్స్ చేసింది. నేహా శెట్టికి కూడా ఇదే ఫస్ట్ ఐటెం సాంగ్.
ఈ పాటని సినిమాలో పెట్టలేదు. తాజగా జత చేశారు. అలాగే ఇప్పుడు యూట్యూబ్ లో కూడా విడుదల చేశారు.