
శోభిత ధూళిపాళ అచ్చ తెలుగు అమ్మాయి. వైజాగ్ కి చెందిన శోభిత మాత్రం ముంబైలో సెటిల్ అయింది. ఆమెకు తెలుగులో అవకాశాలు రావడం లేదు. ఐతే, ఈ విషయంలో వర్రీ ఏమి లేదంట. తన మనసుకు నచ్చిన పనులే చేస్తా తప్ప పని కోసం ఎవరినీ అడగను అంటోంది.
శోభిత ఇప్పుడు హిందీ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. హాట్ హాట్ కిస్సులు, ఎక్స్ పోజింగ్ సీన్లతో ఆమె అక్కడ పాపులర్ అయింది.
మీరు తెలుగు వాళ్ళు… అయినా ఎందుకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రావడం లేదు అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇది. పైగా తనకి ముంబైలోనే కంఫర్ట్ గా ఉంటుంది అంటోది.
వెబ్ సిరీస్ లు కాకుండా ఇన్ స్టాగ్రామ్, మోడలింగ్, బ్రాండ్స్ తో ఈ అమ్మడు బాగానే సంపాదిస్తోంది ముంబైలో. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు మంచి ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే, చేసిన తక్కువ సినిమాలే అయినా 5 మిలియన్ల ఇన్ స్టా ఫాలోవర్స్ ని పొందింది.
ALSO CHECK: Sobhita Dhulipala’s new Photos
ముంబైలో డబ్బు బాగా వస్తుండడం వల్లే అవకాశాల కోసం మన దగ్గర వెంపర్లాడడం లేదు.