
మేస్ట్రో ఇళయరాజా మూకాంబిక అమ్మవారి భక్తుడు. కెరీర్ ప్రారంభం నుంచే ఉడిపి దగ్గర్లోని మూకాంబిక అమ్మ వారి ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. ఏడాదికి రెండుసార్లైనా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక తాజాగా ఆయన అమ్మవారికి వెండి కిరీటాన్ని బహుకరించారు.
కర్ణాటకలోని ఉడుపి జిల్లా కొల్లూరులో ఉన్న శ్రీ మూకాంబిక దేవి ఆలయాన్ని (Shri Mookambika Devi Temple) రాజా నిన్న దర్శించుకున్నారు.
4 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని అమ్మ వారికి బహూకరించారు. అలాగే వీరభద్ర స్వామికి బంగారు ఆయుధాన్ని ప్రదానం చేశారు. తన సంగీత ప్రయాణంలో, జీవితంలో ప్రతిదీ అమ్మ ఆశీస్సులే వల్లే సాధ్యమైందని ఇళయరాజా పేర్కొన్నారు.
మరోవైపు, ఇటీవలే ఇళయరాజా తన అనుమతి లేకుండా తన పాటలు వాడుకున్నందుకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు నోటీసులు ఇచ్చారు. 5 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తున్నారు.





