మళ్ళీ పెళ్లి మాట లేదిక!


ఇలియానా వయసు 35. గతంలో ఆమె ఒక విదేశీ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడింది. కానీ, ఆ పెళ్లి తొందర్లనే పెటాకులు అయింది. రీసెంట్ గా ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి. కానీ అవి పుకార్లు అని తేలింది.

ప్రస్తుతం ఈ భామ ఒక బాలీవుడ్ హీరోతో ప్రణయబంధం సాగిస్తున్నట్లు గుసగుస. ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్న ఆ హీరోతో బంధాన్ని రహస్యంగా ఉంచుతోందట. అందుకే, ఆమె మళ్ళీ పెళ్లి ఆలోచన చెయ్యడం లేదంట. ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తక్కువ సినిమాలు చేస్తోంది. స్లో అండ్ స్టడీ అంటూ కెరీర్ ని కాపాడుకుంటోంది.

ఐతే, ఇన్ స్టాగ్రామ్ ద్వారా మాత్రం బాగానే సంపాదిస్తోంది. తాజాగా ఒక రిసార్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకొని… ఆ రిసార్ట్ ని ఇన్ స్టాగ్రామ్ లో ప్రోమోట్ చేస్తోంది. మాల్దీవులకు చెందిన ఆ రిసార్ట్ లో బికినీలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలని షేర్ చేస్తోంది. ఇదంతా ప్రొమోషన్ లో భాగమే.

Also Check: Ileana in Maldives

Advertisement
 

More

Related Stories