
విశ్వక్ సేన్ నిన్న ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. “నా జీవితంలో ఒక కొత్త దశ మొదలు కాబోతుంది. త్వరలోనే నేను ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయబోతున్నాను,” అంటూ పోస్ట్ చేశాడు. దాంతో విశ్వక్ సేన్ పెళ్లి అని అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు.
ఐతే, నిజంగా పెళ్లా? లేక ఇది ఏమైనా సినిమాకి సంబంధించిన ప్రమోషనా అన్నది క్లారిటీ రావడం లేదు.
విశ్వక్ సేన్ కిప్పుడు 28 ఏళ్ళు. పెళ్లి చేసుకునే వయసే. ఐతే, హీరోలు 30 దాటకుండా పెళ్లి చేసుకోరు. హీరోయిన్లే 30 తర్వాత చేసుకుంటున్నారు. మరి సడెన్ గా విశ్వక్ సేన్ తన పెళ్లి అన్నట్లుగా హింట్ ఇవ్వడంతో డౌట్స్ వస్తున్నాయి. ఇది ఏమైనా ప్రమోషన్ లో భాగమేమో అనిపిస్తోంది.
విశ్వక్ సేన్ ప్రస్తుతం “గ్యాంగ్స్ అఫ్ గోదావరి” అనే సినిమాతో పాటు మరో సినిమాలో నటిస్తున్నాడు. తక్కువ టైంలోనే 10 సినిమాలు పూర్తి చేసి మంచి యువ హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.