ప్రియుడితో జాక్వెలిన్ సహజీవనం!

TeluguCinema 16 Jun 2021
jacqueline news


బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రీసెంట్ గా ఒక తెలుగు సినిమా అంగీకరించింది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తీస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఆమె ఒక రాకుమారిగా నటించనుంది. త్వరలోనే ఆమె షూటింగ్ కి వస్తుంది. ఇది తెలిసిన విషయమే!

ఇప్పుడు ఆమెకి సంబంధించిన వార్త ఏంటంటే… జాక్వెలిన్ కూడా సీరియస్ ప్రేమలో పడిందిట. బాంబే టైమ్స్ పత్రిక కథనం ప్రకారం దక్షిణ భారతానికి చెందిన ఒక వ్యాపారవేత్తతో ఆమె డీప్ లవ్ రిలేషన్ షిప్ లో ఉందట. ఇద్దరూ కలిసి జీవించాలని (సహ జీవనం) సిద్దమయ్యారట.

రీసెంట్ గా ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ కొన్నారట. జాక్వెలిన్ అందులోకి షిఫ్ట్ కానుంది అని ఆ పత్రిక రాసింది.జాక్వెలిన్ సొంత ప్రాంతం… శ్రీలంక. కానీ కెరియర్ అంతా బాలీవుడ్ లోనే సాగింది. ఇండియాలోనే సెటిల్ అయింది.

ఇటీవల ప్రియుళ్ళతో కలిసి అపార్ట్ మెంట్లు కొని సహజీవనం చేస్తున్న హీరోయిన్ల సంఖ్య పెరిగింది. శృతి హాసన్ సొంతంగా తన డబ్బులతోనే ఒక ఇల్లు కొనుక్కొంది. ప్రియుడు శాంతానుతో సహజీవనం చేస్తోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబుతోన్న అలియా భట్, రణబీర్ కపూర్ కూడా అంతే.

ALSO CHECK: Jacqueline in a Gabbana oufit