ఓకే కానీ ఇంకా ఓకే కాదు!

TeluguCinema 01 Mar 2022
janhvikapoor stills 170222 002


పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందిన ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తి అయింది. అది ఆగస్టులో విడుదల కానుంది. ఈ లోపు, మరో సినిమాని మొదలుపెడుతున్నారు. ‘జన గణ మన’ పేరుతో తెరకెక్కే ఈ సినిమా కోసం తన గెటప్ ని కూడా మార్చుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. తన హెయిర్ స్టయిల్ ని మిలిటరీ కటింగ్ గా మార్చేశాడు.

ప్రస్తుతం ఈ సినిమా కోసం మొరాకోలో లొకేషన్లు వెతుకుతున్నారు నిర్మాత ఛార్మి.

మరోవైపు, ఇందులో హీరోయిన్ గా నటించాల్సిందిగా జాన్వీ కపూర్ ని అడిగారు. ఆమె ఒప్పుకొంది. ఐతే, జాన్వీ కపూర్ ఓకే చెప్పినా అది ఓకే అని అనుకోలేం. ఆమె చివరి నిమిషంలో కూడా మనసు మార్చుకునే అవకాశం ఉంది. ‘లైగర్’ సినిమాలో నటించేందుకు జాన్వీ మొదట ఒప్పుకొంది. కానీ ఆ తర్వాత డేట్స్ లేవని తప్పుకొంది. దాంతో, అనన్య పాండేని తీసుకున్నారు.

ALSO READ: మిలిటరీ కటింగ్ లోకి వచ్చిన VD

ఐతే, విజయ్ దేవరకొండ తన ఫేవరేట్ హీరో అని జాన్వీ గత ఇంటర్వ్యూలో చెప్పింది. విజయ్ తో నటించాలని కూడా పేర్కొంది. ఈ సారి డేట్స్, పారితోషికం సమస్య లేకుంటే ఆమె ‘జన గణ మన’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.

janvi vij

ఆమె సెట్స్ కి వచ్చేంతవరకు వెయిట్ చెయ్యాలి.