- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా వెంటనే మరో సినిమా తీస్తున్నారు పూరి జగన్నాధ్. ‘జన గణ మన’ అనే పేరుతో పూరి రూపొందించే దేశభక్తి చిత్రం షూటింగ్ ఏప్రిల్ లో మొదలవుతుంది. ఈ సినిమా కోసం తన గెటప్ ని మార్చేశాడు విజయ్ దేవరకొండ.
మిలిటరీ కటింగ్ తో తాజాగా దర్శనమిచ్చాడు విజయ్ దేవరకొండ. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కి ఇలా వచ్చాడు దేవరకొండ. కాకపోతే క్యాప్ తో తన గెటప్ ని కవర్ చేసే ప్రయత్నం చేశాడు.
‘జన గణ మన’లో సైనికుడిగా కనిపిస్తాడు విజయ్ దేవరకొండ. కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు పూరి.
త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది. విజయ్ దేవరకొండతో పూరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీయడం స్పెషలిటీ. గతంలో రవితేజ, ప్రభాస్ తో ఇలా చేశారు పూరి. ఇప్పుడు విజయ్ తో.